నేడు జిల్లాలో ఓపెన్ చెస్ టోర్నీ పోటీలు
కృష్ణా: ఇవాళ విజయవాడ ఆంధ్రా లయోల కళాశాలలో ఓపెన్ చెస్ టోర్నీ పోటీలు నిర్వహిస్తునట్లు ది విజయవాడ చెస్ సంఘం అధ్యక్షుడు ఎండీ అక్బర్ పాషా, కార్యదర్శి ఎం. రాజీవ్ తెలిపారు. అండర్-7, 9, 11, 13, 15 విభాగాల్లో ప్రతిభ చూపిన బాలబాలికలకు బహుమతులు అందిస్తామని పేర్కొన్నారు. వివరాలకు 9030308811, 7670842527 నంబర్లను సంప్రదించాలన్నారు.