'సోషల్ మీడియా పై మోజు తగ్గించండి'
VZM: విద్యార్థుల ఆసక్తిని గుర్తించి ఆయా రంగాల్లో ప్రోత్సహించాలని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచించారు. పట్టణంలోని కస్పా జెడ్పీ హైస్కూల్‌లో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్, టీచర్స్ మీట్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. సోషల్ మీడియా మోజు తగ్గించి చదువు, క్రీడలపై దృష్టి పెట్టాలన్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన అవసరమన్నారు.