భైరవకోన క్షేత్రానికి రూ. 5,63,596 లక్షల ఆదాయం
ప్రకాశం: సీఎస్‌పురం మండలంలో వెలసిన భైరవకోన క్షేత్రానికి 2నెలల 18 రోజులకు గాను రూ.5,63,596 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి వంశీకృష్ణారెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 17 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు వచ్చిన ఆలయ హుండీ కానుకలను తాము లెక్కించినట్లు ఆయన తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ అర్చకులు పాల్గొన్నారు.