పిఠాపురం రైల్వే స్టేషన్‌కు భారీగా నిధులు
AP: పిఠాపురం రైల్వే స్టేషన్ త్వరలో అత్యాధునిక హంగులతో ముస్తాబు కానుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్' పరిధిలోకి పిఠాపురం స్టేషన్‌ను చేర్చుతూ రైల్వే మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రూ. 37.25 కోట్ల భారీ నిధులను మంజూరు చేసింది. దీంతో వెయిటింగ్ హాల్స్, ఆధునిక టాయిలెట్లు, స్టేషన్ భవనం ఏర్పాటు చేయనున్నారు.