'ప్రజల దృష్టిని మళ్లించేందుకే జగన్ కొత్త నాటకం'
కోనసీమ: అమరావతి రాజధానిపై కేంద్రం గుర్తింపు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే జగన్ కొత్త నాటకాలకు తెరతీశారని కొత్తపేట మండల టీడీపీ నాయకులు ఆరోపించారు. గురువారం కొత్తపేట టీడీపీ కార్యాలయంలో వారు మాట్లాడారు. మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదన్నారు. నైతిక హక్కును ఎప్పుడో కోల్పోయిందన్నారు.