VIDEO: కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించండి : ఎమ్మెల్యే
WNP: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదలకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి మండలం అప్పాయిపల్లి గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సునీతమ్మ కు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో మరింత అభివృద్ధి, మౌలిక సదుపాయాలు రావాలంటే కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని ఆయన కోరారు.