కేశరాజుపల్లిలో కుక్కల బీభత్సం

కేశరాజుపల్లిలో కుక్కల బీభత్సం

NLG: జిల్లా కేంద్రంలోని 4వ వార్డులో కొంత కాలంగా వీధి కుక్కల స్వైర విహారం పెరిగింది. పలుమార్లు కేశరాజుపల్లి గ్రామస్తులు మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం గ్రామస్తులపై కుక్కలు దాడి చేయడంతో బాధితులు దవాఖాన బాటపట్టారు. మొత్తం 11 మందిపై కుక్కలు దాడి చేసి బీభత్సం సృష్టించాయి.