కాంగ్రెస్ వచ్చాక ఒక్క పని చేయలేదు: MLC కవిత

HYD: గత 16నెలల్లో CM రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోట్ల అప్పులు తెచ్చి ఖజానాపై భారం మోపిందని MLC కవిత ఆరోపించారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆమె సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ వచ్చాక ఏ ఒక్క పని చేయలేదని విమర్శించారు. CM తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని, “నన్ను చెప్పుల దొంగలా చూస్తున్నారంటూ" మాట్లాడడం ఎంతవరకు సముచితం? అని కవిత ప్రశ్నించారు.