టీమ్ ఇండియాకు మంత్రి సుభాష్ ప్రశంసలు

టీమ్ ఇండియాకు మంత్రి సుభాష్ ప్రశంసలు

కోనసీమ: ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన మహిళల క్రికెట్ ప్రపంచకప్ -2025 ఫైనల్లో దక్షిణాఫ్రికాపై టీమిండియా జట్టు చారిత్రక విజయాన్ని సాధించి జగజ్జేతగా నిలిచి ప్రపంచ కప్‌‌ను కైవసం చేసుకోవటం పట్ల రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం హర్షం వ్యక్తం చేశారు. యావత్ దేశం గర్వపడేలా మన అమ్మాయిలు అద్భుతమైన ప్రదర్శనతో ఈ ఘనతను సాధించారని కొనియాడారు.