VIDEO: నూతన వెండి రథం ట్రయల్ రన్ విజయవంతం
శ్రీ సత్యసాయి బాబా 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా నూతనంగా నిర్మించిన శ్రీ సత్యసాయి వెండి రథాన్ని పుట్టపర్తి పురవీధుల్లో ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్ విజయవంతమైంది. ఈ నెల నవంబర్ 18న నిర్వహించనున్న రథోత్సవానికి సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది.