భారీగా బంగారం పట్టివేత

భారీగా బంగారం పట్టివేత

TG: హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 11 బంగారు కడ్డీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని ఐరన్ బాక్స్‌లో పెట్టి తీసుకొచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన బంగారం విలువ రూ.1.55 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.