మిర్యాలగూడలో తీవ్ర ఉద్రిక్తత
NLG: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా మిర్యాలగూడ మండలం ముల్కలకాల్వలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికార పార్టీ అభ్యర్థి అధికారుల అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని పరాజయం పొందిన అభ్యర్థి వర్గం ఆరోపించింది. ఓటమి చెందిన అభ్యర్థి బయటకు వస్తుండగా అందరూ చూస్తుండగానే దాడికి పాల్పడటంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.