VIDEO: ప్రభుత్వ మంచిని అభినందించాలి: మంత్రి

NLR: రూరల్ 17వ డివిజన్ వడ్డిపాలెంలో MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి మంత్రి పార్థసారథి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు మంత్రికి స్వాగతం పలికారు. రూ.85 లక్షలతో సిమెంట్ రోడ్డు, బీటీ రోడ్డు,పైపులైన్, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి ఒక్కరూ అభినందించాలని మంత్రి పేర్కొన్నారు.