'అక్రమ కేసులు బనాయించడం సరికాదు'

KMM: ఖమ్మం జిల్లా రిపోర్టర్ సాంబశివరావుపై అక్రమంగా కేసు నమోదు చేయడాన్ని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. రైతులకు యూరియా అందించడంలో విఫలమైన ప్రభుత్వం, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి నిర్బంధాలు ప్రయోగించడం సరైంది కాదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సరికాదని మండిపడ్డారు.