"కోచింగ్ సెంటర్లను కంట్రోల్‌లో పెడతాం"

"కోచింగ్ సెంటర్లను కంట్రోల్‌లో పెడతాం"

KMR: పోటీ పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. విద్యారంగ సంస్కరణలపై సచివాలయంలో బుధవారం జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పలు అంశాలపై ఉన్నతాధికారులకు ఆయన మార్గదర్శకం చేసారు. సమావేశంలో సబ్ కమిటీ సభ్యురాలు, మంత్రి సీతక్క కూడా పాల్గొన్నారు.