పర్వతిపరమేశ్వర దేవస్థానంలో ప్రత్యేక పూజలు

VKB: బొంరాస్పేట మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామ శివారులోని శ్రీపార్వతి పరమేశ్వర దేవస్థానంలో శ్రావణ మాసం చివరి సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. రాతి కింద వెలసిన లింగానికి, అలాగే రాతి గుండుపై వరద పాశం పోసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులకు ఆలయ కమిటీ అన్నదానం ఏర్పాటు చేశారు.