సిద్ధవటంలో 60 హెక్టార్లలో వరి పంట నష్టం: MRO
KDP: సిద్ధవటం మండలంలో మొంథా తుఫాన్ వల్ల 60 హెక్టార్లలో వరి పంట నష్టం వాటిల్లిందని MRO తిరుమల బాబు అన్నారు. గురువారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. మండలంలో కురిసిన భారీ వర్షానికి కడపాయపల్లె గ్రామంలో 15 హెక్టార్లు, టక్కోలులో 10, మాచుపల్లిలో 10, జ్యోతిలో 5, వంతాటిపల్లిలో 10, జంగాలపల్లిలో 10 హెక్టార్లలో వరి పంట నష్టం జరిగినట్లు అంచనా వేశామన్నారు.