'ప్రైవేట్ వాహనాలకు బస్సు స్టేషన్‌లోకి అనుమతి లేదు'

'ప్రైవేట్ వాహనాలకు బస్సు స్టేషన్‌లోకి అనుమతి లేదు'

NLG: దేవరకొండ ఆర్టీసీ బస్సు స్టేషన్‌లోనికి ప్రైవేట్ వాహనాలు అనుమతి లేదని ఇంఛార్జ్ డిపో మేనేజర్ పడాల సైదులు ఇవాళ తెలిపారు. బస్సు స్టేషన్‌లో ద్విచక్ర వాహనాలు ఇష్టానుసారంగా పార్కింగ్ చేస్తున్నారని, చర్యలు తప్పవని అన్నారు. హెచ్చరిక బోర్డులు, సిబ్బందితో అవగాహన కల్పిస్తున్నామన్నారు. మినీ బస్టాండ్‌లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.