మేడారంలో తేలనున్న తేదీలు..!
HNK: రాష్ట్రంలో 116 పురపాలక సంఘాలు, 7 నగర పాలక సంస్థల ఎన్నికల తేదీలను మేడారంలో జరిగే రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ప్రకటించనున్నారు. సమావేశం ఈనెల 18న సాయంత్రం జరుగుతుంది. సీఎమ్ రేవంత్ రెడ్డి కూడా ఆ రోజు మేడారానికి చేరుకుని సమావేశంలో పాల్గొంటారని అధికారులు ఒక ప్రకటన ద్వారా తెలిపారు.