తెనాలి వైకుంఠపురంలో భక్తుల రద్దీ

తెనాలి వైకుంఠపురంలో భక్తుల రద్దీ

GNTR: తెనాలిలో ప్రసిద్ధి చెందిన వైకుంఠపురం దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయానికి భారీగా తరలివచ్చారు. శ్రీలక్ష్మీ పద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకుని పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండే భక్తులు ఆలయానికి తరలి రావడంతో క్యూలైన్లు నిండిపోయాయి.