దుకాణాదారుల పేర్లను నమోదు చేయాలి: డీఈఓ

NGKL: జిల్లాలోని ప్రవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను విక్రయించే దుకాణాదారుల పేర్లను తమ కార్యాలయములో అందజేయాలని జిల్లా విద్యాశాఖాధికారి గోవింద రాజులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను విక్రయించే దుకాణాదారుల పేర్లను ఈ నెల 10. 06. 2024 తప్పక సమర్పించాలని ఆదేశించారు.