సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

SRPT: సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మరణించడంతో హైదరాబాద్ లోని మక్దూం భవన్‌లో ఆయన పార్థివ దేహానికి ఆదివారం ఎమ్మెల్యే సామేలు పూలమాలవేసి నివాళులర్పించారు. నిబద్ధతతో ప్రజా సమస్యల పట్ల స్పష్టమైన అవగాహనతో క్రియాశీలకంగా వ్యవహరించిన సురవరం మన మధ్య లేకపోవడం ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి తీరని లోటని అన్నారు.