పేద బాలికలకు సైకిళ్ల వితరణ

పేద బాలికలకు సైకిళ్ల వితరణ

ELR: పెదపాడు మండలం అప్పనవీడు జడ్పీ హైస్కూల్ బాలికలకు శుక్రవారం స్టేట్ బ్యాంకు వారు ప్రతిభ గల పేద బాలికలకు సైకిళ్లను బహుమతిగా అందించారు. పాఠశాల హెచ్ఎం తోట పుష్పావతి మాట్లాడుతూ.. చదువులలో ప్రతిభ కనపరిచి అన్ని రంగాలలో విజేతలుగా నిలవాలన్నారు. పేద బాలికల చదువు కొనసాగింపుకు సైకిళ్లను బహుమతిగా అందించడం అభినందనీయమన్నారు.