నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

గుంటూరు-2 డీఈఈ ఎన్ గురవయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అశోక్ నగర్, పండరీపురం, లక్ష్మీపురం మెయిన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయబడుతుందని పేర్కొన్నారు. రహదారి విస్తరణ పనుల్లో భాగంగా చెట్ల కొమ్మలను తొలగించడం, విద్యుత్ లైన్లను మార్చడం వంటి పనుల కోసం ఈ అంతరాయం ఏర్పడుతుందన్నారు.