VIDEO: తేలిన కంకర రోడ్డుతో వాహనదారుల ఇక్కట్లు

VIDEO: తేలిన కంకర రోడ్డుతో వాహనదారుల ఇక్కట్లు

JN: స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని నమిలిగొండ నుంచి పామునూర్ రోడ్డుపై కంకర పోసి నెలలు గడుస్తున్నా పనులు పూర్తి చేయకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కంకర తేలి బైకులు జారి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాకపోకల సమయంలో లేస్తున్న దుమ్ముతో అనారోగ్యానికి గురవుతున్నామని.. ఇప్పటికైనా అధికారులు స్పందించి పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.