వంపుగూడ సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే
MDCL: కాప్రా డివిజన్ వంపుగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కొత్త కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. కమ్యూనిటీ హాల్, బస్సు సౌకర్యం, డ్రైనేజీ సమస్య పరిష్కారం, బార్ తొలగింపుపై కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.