ప్రత్యేక అలంకారంలో శ్రీ విరుపాక్షి మారమ్మ

CTR: పుంగనూరు పట్టణ పరిధిలోని MBT రోడ్డులో గల శ్రీ విరుపాక్షి మారమ్మ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనంయిచ్చింది. ఉదయం అర్చకులు అమ్మవారి విగ్రహాన్ని ఫల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత పసుపు, కుంకుమ, వెండి ఆభరణాలతో అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు.