JNTU మహిళా క్రీడాకారులతో అటెండర్ ప్రయాణం

HYD: JNTUలోని స్పోర్ట్స్ విభాగంలో తవ్వే కొద్ది విషయాలు బయటకు వస్తున్నాయి. యూనివర్సిటీ తరఫున స్పోర్ట్స్‌లో పాల్గొనే మహిళా క్రీడాకారుల వెంట అటెండర్‌ను పంపడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మహిళల వెంట తప్పనిసరిగా మహిళా PDని పంపించాల్సి ఉన్నా నిబంధనలకు వర్సిటీ స్పోర్ట్స్ అధికారులు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి.