స్విగ్గి బాయ్‌పై దాడి అమానుషం: DYFI

స్విగ్గి బాయ్‌పై దాడి అమానుషం: DYFI

NLR: నెల్లూరులో మురళీకృష్ణ హోటల్ యాజమాన్యం స్విగ్గి డెలివరీ బాయ్‌పై దాడి చేయడం అమానుషమని DYFI జిల్లా కార్యదర్శి ఎం.వి. రమణ అన్నారు. సరైన ఉద్యోగాలు లేక స్విగ్గిలో పనిచేస్తున్న వారిపై ఇలా దాడి చేయడం సరికాదని, వారికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దాడిని నిరసిస్తూ డీవైఎఫ్ఐ నాయకులు నరసింహ, తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించారు.