జిల్లాలో భారీగా పోలీసుల బదిలీలు

జిల్లాలో భారీగా పోలీసుల బదిలీలు

సత్యసాయి: జిల్లాలో భారీగా పోలీసులను బదిలీ చేస్తూ ఎస్పీ సతీష్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. ఐదేళ్లు ఒకే చోట ఉన్నవారిని పారదర్శక కౌన్సెలింగ్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేశారు. ఇద్దరు ఎస్సైలు, 21 ఏఎస్సైలు, 49 హెడ్ కానిస్టేబుళ్లు, 189 కానిస్టేబుళ్లు, 30 మహిళా కానిస్టేబుళ్లను బదిలీ చేసినట్లు పేర్కొన్నారు. సిబ్బంది వెంటనే విధుల్లో చేరాలని ఎస్పీ ఆదేశించారు.