జిల్లాలో పెరిగిన ఎరువుల ధరలు

జిల్లాలో పెరిగిన ఎరువుల ధరలు

GNTR: మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు అన్నట్లు రైతన్న పరిస్థితి తయారైంది. వర్షాభావం, మద్దతు ధరలు లేక అల్లాడుతున్న రైతులకు ఖరీఫ్ సీజన్‌లో పెరిగిన ఎరువుల ధరలు మరింత భారంగా మారాయి. డీఏపీ, యూరియా మినహా కాంప్లెక్స్ ఎరువుల బస్తాపై రూ.100, పొటాష్‌పై రూ.150 పెరగడంతో పెట్టుబడి భారం పెరిగిందని జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.