నిజామాబాద్లో షార్ట్ సర్క్యూట్‌తో షాపు దగ్ధం

NZB: జిల్లా కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ తో ఓ షాపు దగ్ధమైంది. ఈ ఘటన ప్రగతినగర్ ఎండల అపార్ట్మెంట్ సమీపంలోని సప్తగిరి అసోసియేట్లో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒకసారిగా మంటలు ఎగిసే పడడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.