ఘనంగా మల్లెలమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం
KDP: IIIT ప్రాంగణంలో వెలసిన మల్లెలమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు ఉదయం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి అలంకరించారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తులసిరెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.