బీమా డబ్బు కోసం వేధింపులు.. మహిళ ఆత్మహత్య
KMR: నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డి గ్రామానికి చెందిన లక్ష్మీ అత్తారింటి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్ గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. లక్ష్మీ భర్త గతంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు చెప్పారు. ఆయన పేరుపై వచ్చిన బీమా డబ్బుల కోసం అత్తారింటి వారు లక్ష్మీని వేధించినట్లు పేర్కొన్నారు.