రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ఆదేశం
ATP: శింగనమల నియోజకవర్గ అధికారులతో MLA బండారు శ్రావణి సమావేశం నిర్వహించారు. హౌసింగ్ స్కీం కింద ఇంటి పట్టాల మంజూరు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై చర్చించారు. వివిధ కాలనీల్లో కొత్తగా ఇవ్వాల్సిన నివేశన పట్టాల కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్సీ స్మశాన వాటికల అభివృద్ధి పనులు చేపట్టాలని, స్థలాల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.