బహిరంగంగా పెట్రోల్ అమ్మడం హానికరం: ఎస్పీ

బహిరంగంగా పెట్రోల్ అమ్మడం హానికరం: ఎస్పీ

ADB: బహిరంగంగా పెట్రోల్ అమ్మడం ప్రజల ప్రాణానికి హానికరమని ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ బుధవారం తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా డబ్బాలో పెట్రోల్ అమ్మిన పట్టణంలోని బ్రాహ్మణవాడకు చెందిన బంక్ యజమాని ఫైజల్ పై వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. పెట్రోల్ లేదని దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.