ఉప్పల్‌లో అభిషేక్ మెరుపు హాఫ్ సెంచరీ!

ఉప్పల్‌లో అభిషేక్ మెరుపు హాఫ్ సెంచరీ!

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో అభిషేక్ శర్మ మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బరోడాతో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 19 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బెంగాల్‌తో జరిగిన గత మ్యాచ్‌లోనూ అభిషేక్ 148 పరుగుల భారీ శతకం సాధించిన విషయం తెలిసిందే.