'భూమిని కబ్జా చేసిన వారి‌పై కఠిన చర్యలు తీసుకోవాలి'

'భూమిని కబ్జా చేసిన వారి‌పై కఠిన చర్యలు తీసుకోవాలి'

BHPL: రేగొండ మండలం కనపర్తి గ్రామంలో గీత పారిశ్రామిక సహకార సంఘం భూమిని కబ్జా చేసినవారిపై చర్యలు తీసుకోవాలని గౌడ కులస్థులు శనివారం డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ.. తాళ్లు ఎక్కి కల్లు అమ్ముకుంటూ జీవనోపాధి గడుపుతుంటే కొందరు భూమిని కాజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన భూమిలో తాటి చెట్లు పెంచామన్నారు.