కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త
BHNG: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వేతనాల చెల్లింపులో ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపుతూ ఏప్రిల్ నెల నుంచి నేరుగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లోనే జీతాలు జమ చేయాలని నిర్ణయించింది. ఈ విప్లవాత్మక మార్పు ద్వారా మధ్యవర్తుల దోపిడీకి బ్రేక్ పడనుంది.