జిల్లాకు ప్రకృతి ప్రసాదించిన వరం మైపాడు బీచ్

జిల్లాకు ప్రకృతి ప్రసాదించిన వరం మైపాడు బీచ్

NLR: మైపాడు బీచ్‌ను ఒక సమగ్ర ప్రణాళికతో కేరళ తరహా టూరిజం సెంటర్‌గా అభివృద్ధి చేయాలన్నది సీఎం చంద్రబాబు సంకల్పమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆనంద్‌తో కలిసి మైపాడులో నిర్వహించిన బీచ్ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.