కండక్టర్ నిజాయితీని మెచ్చుకున్న ప్రయాణికులు

కండక్టర్ నిజాయితీని మెచ్చుకున్న ప్రయాణికులు

కోనసీమ: రాజమండ్రి నుంచి రాజోలు వస్తున్న ఆర్టీసీ బస్‌లో గురువారం రాత్రి ప్రయాణికుడు రాజేంద్రప్రసాద్ సెల్ ఫోన్ మర్చిపోయాడు. బస్ కండక్టర్ ఎస్.ఎన్.భూషణం సెల్ ఫోన్ ను జాగ్రత్త పరిచి సంబంధిత ప్రయాణికుడికి సమాచారం ఇచ్చి రాజోలు ఆర్టీసీ డిపోలో ప్రయాణికుడికి అందజేశారు. ఈ సందర్బంగా కండక్టర్ నిజాయితీని పలువురు ప్రయాణికులు మెచ్చుకుని అభినందించారు.