'మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి'
నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నేత టి.సాగర్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతు సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేసి ఆదుకోవాలన్నారు. ఆలస్యం చేస్తే రైతులు దళారులకు అమ్ముకొని నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.