7వ వార్డు నుంచి బీజేపీలోకి చేరికలు
MNCL: క్యాతనపల్లి మున్సిపాలిటీ 7వార్డులోని రాజండి లావణ్య, శ్రీనివాస్ బీజేపీలోకి చేరారు. జిల్లా ఉపాధ్యక్షులు అక్కల రమేష్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు, కృష్ణమూర్తి, క్యాతనపల్లి పట్టణ అధ్యక్షులు ధన్ సింగ్, పట్టణ నాయకులు కట్టా ఈశ్వర్ చారీ పాల్గొన్నారు.