స్వయంగా స్వీయగణన పూర్తి చేసుకున్న కలెక్టర్
VZM: జనగణన-2027 కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తన స్వీయ గణన ప్రక్రియను గురువారం పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,, ప్రజలు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి సులభంగా వివరాలను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. కుటుంబ సభ్యుల సమాచారాన్ని స్వయంగా నమోదు చేసే ఈ సౌకర్యాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు.