సమిష్టి కృషితోనే సీఎం పర్యటన విజయవంతం: కలెక్టర్
NLR: ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటనను విజయవంతంగా నిర్వహించినందుకు జిల్లా స్థాయి అధికారులను కలెక్టర్ హిమాన్షు శుక్లా వారిని ప్రత్యేకంగా సత్కరించారు. సీఎం పర్యటనలో కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించినందుకు డీఆర్డీఏ, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్లు నాగరాజు కుమారి, గంగాభవాని, జడ్పీ సీఈవో తదితరులను అభినందించి సత్కారాలు అందించారు.