కొత్తూరు గ్రామ పంచాయతీ ఏకగ్రీవం

కొత్తూరు గ్రామ పంచాయతీ ఏకగ్రీవం

MLG: జిల్లాలో ఏకగ్రీవాల పరంపర కొనసాగుతోంది. ఎస్టీ జనరల్ రిజర్వుడు ములుగు మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ ఏకగ్రీవమైనది. కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థి గట్టి సుదర్శన్ ఖరారయ్యారు. ఉప సర్పంచ్ బీఆర్ఎస్ బలపరిచిన అక్కల వినోదను ఎన్నుకున్నారు. మొత్తం ఎనిమిది వార్డులకు గానూ మూడు కాంగ్రెస్, నాలుగు బీఆర్ఎస్ పంచుకున్నాయి. ఏకగ్రీవ ఎన్నికపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.