ఆర్మీకి మద్దతుగా మృత్యుంజయ పఠనం చేసిన ఎమ్మెల్యే

ASF: కాగజ్ నగర్ మండలంలోని ఈజ్గాం గ్రామంలో వెలసిన ప్రాచీన శివమల్లన్న ఆలయంలో శుక్రవారం దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా భారత ఆర్మీకి సంఘీభావంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే హరీష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా MLA మహా మృత్యుంజయ పఠనం చేశారు. భగవంతుని కృపతో యుద్ధంలో విజయం సాధిస్తామని అన్నారు.