జిల్లా నూతన ఎస్పీ గా సంగ్రామ్ సింగ్ పాటిల్ బాధ్యతలు
NGKL: జిల్లా నూతన ఎస్పీగా సంగ్రామ్ సింగ్ పాటిల్ శనివారం ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు చట్టబద్ధంగా తమ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉండాలని సిబ్బందిని ఆదేశించారు.