VIDEO: పర్వతగిరిలో యూరియా కోసం ఘర్షణ

WGL: యూరియా కోసం రైతులు బారులు తీరి ఘర్షణ పడుతున్న ఘటన పర్వతగిరి మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. సొసైటీకి యూరియా బస్తాలు తీసుకోవడానికి గాను అధికారులు టోకెన్లను ఇస్తున్నారు. రైతులు భారీగా తరలి రావడంతో తోపులాట జరిగింది. పోలీసులు రైతులను అదుపు చేస్తున్న పట్టించుకోకుండా ఒకరినొకరు తోసుకుంటున్నారు.