సౌదీకి ట్రంప్ F-35 జెట్‌ల గిఫ్ట్
సౌదీ అరేబియాకు F-35 యుద్ధ విమానాలను అమ్మేందుకు అమెరికా సిద్ధమైంది. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అగ్రరాజ్య పర్యటనకు వెళ్లకు ముందే అధ్యక్షుడు ట్రంప్ ఈ అమ్మకాలకు ఆమోదం తెలపనున్నారు. ఈ యుద్ధ విమానాలను కొనాలని సౌదీ కోరుకుంటుందని.. వారు తమకు మంచి మిత్రులని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఈ నిర్ణయంపై ఇజ్రాయెల్ ఇంత వరకు వ్యతిరేకించకపోవటం విశేషం.